ETV Bharat / state

క్వారంటైన్​లో.. 17 రోజులు ఉండాల్సిందే! - క్వారంటైన్​ న్యూస్​ ఇన్​ కృష్ణా

కృష్ణా జిల్లా వ్యాప్తంగా కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. వివిధ ప్రాంతాల్లో కరోనా అనుమానిత లక్షణాలున్న వారిని క్వారంటైన్​కి పంపిండం.. తిరిగి ఇంటికి పంపడం వంటి చర్యలను ప్రణాళిక ప్రకారం అమలు చేస్తోంది.

Government special orders on Quarantine in krishna district

author img

By

Published : Apr 19, 2020, 2:09 PM IST

కృష్ణా జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో కరోనా అనుమానిత లక్షణాలున్న వారితో పాటు పాజిటివ్‌ వచ్చిన వ్యక్తితో సన్నిహితంగా మెలిగిన వారిని అధికారులు క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించి పర్యవేక్షిస్తున్న విషయం తెలిసిందే. క్వారంటైన్‌ కేంద్రాల్లో 14 రోజుల పాటు ఉంచిన అనంతరం వారిని హోం క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పాజిటివ్‌ కేసులు ఎక్కువగా నమోదవుతున్న కారణంగా.. దానికి అడ్డుకట్ట వేసేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే.. అనుమానితులను క్వారంటైన్‌లో 17 రోజులు పూర్తిగా ఉండేలా చర్యలు తీసుకుంటూ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది.

జిల్లాలోని మచిలీపట్నం, పెడన, గుడివాడ, నూజివీడు, విజయవాడ, గన్నవరం తదితర ప్రాంతాల్లో 30కి పైగా కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. ఈడుపుగల్లు క్వారంటైన్‌లో 86 మంది, పెనమలూరులో 60, నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో 38, నందిగామలో 27, పెడనలో 25, జగ్గయ్యపేటలో 14, బందరులో 22 మంది వంతున జిల్లాలోని క్వారంటైన్‌ కేంద్రాల్లో 600 మందికి పైగా ఉంటున్నారు. ఈ కేంద్రాల్లో ఇప్పటి వరకు 14 రోజులు పూర్తిచేసుకున్న వారిని ఇంటికి పంపించి.. గృహ నిర్బంధం పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. శనివారం నాటికి మచిలీపట్నంతో పాటు పెడన తదితర ప్రాంతాల్లో 14 రోజుల క్వారంటైన్‌ పూర్తి చేసుకున్నవారు పదుల సంఖ్యలో ఇంటికి వెళ్లాల్సి ఉంది. ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా వారంతా 17 రోజులపాటు క్వారంటైన్‌ను పూర్తిచేసేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ కేంద్రాలను పర్యవేక్షించే అధికారులకు కూడా ఉత్తర్వులు జారీ చేశారు.

ర్యాపిడ్‌ పరీక్షలకు ఏర్పాట్లు:

జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. వీటిలో ఎక్కువగా సామాజిక వ్యాప్తి కేసులు ఉంటున్నట్టు తేలడంపై అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ర్యాపిడ్‌ టెస్టులు నిర్వహించేలా ఆదేశాలు జారీ కాగా.. అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా ఆసుపత్రిలో నాలుగు పరికరాల ద్వారా పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు.

18వ రోజున ఇంటికి పంపుతాం

"ప్రభుత్వం విడుదల చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం క్వారంటైన్స్‌లో ఉండే వ్యక్తులంతా 17 రోజులు పూర్తిగా ఉండాల్సిందే. 18వ రోజున ఇంటికి పంపుతాం. అక్కడ మరో 14 రోజులు హోం క్వారంటైన్‌ చేయాలి. ప్రజలు ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వారికి అవసరమైన వసతులతో పాటు బలవర్థకమైన ఆహారం కూడా అందజేస్తున్నాం. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అందరూ సహకరించాలని కోరుతున్నాం." - విల్సన్‌బాబు, జిల్లా క్వారంటైన్స్‌ ఇన్‌ఛార్జి

ఇంటి వద్ద ప్రత్యేక ఏర్పాట్లు:

క్వారంటైన్‌ పూర్తిచేసుకున్న వారు మరో 14 రోజులు గృహనిర్బంధంలోనే ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. హోం క్వారంటైన్‌ పాటించే సమయంలో ఎలా ఉండాలి, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అనే విధివిధానాలను కూడా విడుదల చేశారు.

  • క్వారంటైన్‌ పాటించే వ్యక్తికి ప్రత్యేక గది కేటాయించాలి.
  • కుటుంబ సభ్యులు అతనితో కనీసం మీటరు దూరం పాటించేలా చూసుకోవాలి.
  • ప్రత్యేక మరుగుదొడ్లు ఏర్పాటు చేసుకోవాలి.
  • ఇంటికి ఇతరులు ఎవరూ రాకుండా జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు క్వారంటైన్‌ వ్యక్తితో మాట్లాడకుండా చూసుకోవాలి.
  • రోజుకు రెండు సార్లు శరీర ఉష్ణోగ్రతను పరీక్షించాలి.
  • కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
  • క్వారంటైన్‌ పాటించే వ్యక్తికి ప్రత్యేకంగా పాత్రలు ఉంచాలి.
  • దుస్తులు, పాత్రలను సబ్బుతో వేరుగా శుభ్రపరచాలి.

ఇదీ చదవండి:

రెడ్​ జోన్లలో డ్రోన్​ కెమెరాలతో నిఘా: విజయవాడ సీపీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.