Government Neglecting the Wealth From Garbage in Villages : దేశానికి గ్రామాలు పట్టుకొమ్మలు పల్లెలు.. గ్రామాలు పరిశుభ్రంగా ఉంటేనే దేశం, రాష్ట్రం ఆరోగ్యంగా ఉంటుంది. గ్రామాలను పరిశుభ్రంగా, కాలుష్యరహితంగా, ఉంచడమే లక్ష్యంగా గత ప్రభుత్వం చెత్త నుంచి సంపద సృష్టి కార్యక్రమాన్ని చేపట్టాయి. గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్య శాశ్వత పరిష్కారం కోసం గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పంచాయతీకో సంపద తయారీ కేంద్రాన్ని (Garbage to Wealth Creation Programme) ప్రారంభించింది. హరిత రాయబారుల ద్వారా ఇళ్లు, వీధుల్లో వ్యర్ధాలు సేకరించి వీటి నుంచి ఎరువులు తయారు చేయాలన్నది కార్యక్రమ ఉద్దేశం.
Waste to Wealth From Garbage in Pedaparupudi : కృష్ణా జిల్లాలో ప్రయోగాత్మకంగా చేపట్టిన కార్యక్రమం విజయవంతం కావడంతో దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేశారు. 13 వేలకుపైగా సంపద తయారీ కేంద్రాలు ఏర్పాటు చేసి దాదాపు 40 వేల మంది హరిత రాయబారులను నియమించారు. వ్యర్ధాల నుంచి తయారైన ఎరువులను గ్రామాల్లో రైతులకు మార్కెట్లో కంటే తక్కువ ధరకు విక్రయించేవారు. ఎందుకూ పనికి రాని చెత్త ను రీసైక్లింగ్ చేసి కాలుష్య రహితంగా చేయడం సహా సంపద సృష్టించడం, తద్వారా పంచాయతీలను ఆర్ధికంగా పరిపుష్టి చేయడమే లక్ష్యంగా చేపట్టిన కార్యక్రమం సంపూర్ణంగా విజయవంతమైంది.
చెత్తను రీసైక్లింగ్ (Recycling of garbage) చేయడం ద్వారా ఎరువులను తయారు చేసి భళా అనిపించారు. తద్వారా ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఆరోగ్య కరమైన పంటలు పండించేవారు. ఈ కేంద్రాలు సమర్థంగా అమలు చేసిన సర్పంచులు కేంద్ర ప్రభుత్వం చేతుల మీదుగా అభినందన దృవ పత్రాలు అందుకున్నారు.
Solid Waste Come Wealth Processing Centers are Closed Due to Lack of Funds : రాష్ట్ర ప్రభుత్వం సైతం పలు అవార్డులను కైవసం చేసుకుంది. ఎంతో చక్కగా అమలైన కార్యక్రమం ప్రస్తుత ప్రభుత్వం వచ్చాక పరిస్థితి తారుమారైంది. పంచాయతీలకు నిధులివ్వకపోవడంతో కేంద్రాల నిర్వహణకు నిధుల కొరత ఏర్పడింది. కార్మికులకు సరిగా జీతాలు చెల్లించని కారణంగా చాలా చోట్ల పేరుకే కేంద్రాలు ఉన్నాయి. వీటిలో కార్యకలాపాలు నిలిచిపోయాయి. గతంలో కళకళలాడిన కేంద్రాలు నేడు ప్రభుత్వం నిర్లక్ష్యంతో వెలవెల బోతున్నాయి.
సంపద తయారీ కేంద్రాలు నేడు ఈ దుస్ధుతికి చేరుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వమే ప్రధాన కారణం. గతంలో ఈ కేంద్రాల నిర్వహణ కోసం గతంలో రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసేది. కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు విడుదల చేసే గ్రాంట్ నిధులతో పంచాయతీ సర్పంచులు సమర్థంగా నడిపేవారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక పంచాయతీలకు నిధులను దారి మళ్లించింది. పంచాయతీ సర్పంచుల అనుమతి లేకుండా పంచాయతీల ఖాతాల్లో నిధులు తన ఖాతాలోకి మళ్లించింది. దీంతో గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు కేటాయించిన నిధులను సైతం ఖాళీ చేసేసింది. దీంతో పంచాయతీల ఖాతాల్లో నిధుల్లేక కేంద్రాల నిర్వహణ అటకెక్కింది.
Garbage Collection Vehicles in AP: ఏపీలో అలంకార ప్రాయంగా ఈ-ఆటోలు.. మూలనపడేసిన జగన్ సర్కార్..
రాష్ట్ర వ్యాప్తంగా వేలాది సంపద సృష్టి కేంద్రాలు పాడుపడ్డాయి. నిధులను కాజేసిన సర్కారు సంపద తయారీ కేంద్రాల నిర్వహణ బాధ్యత గ్రామ పంచాయతీలదేనని చెప్పి తప్పించుకుంది. కేంద్ర ఆర్థిక సంఘం నిధుల్లో నుంచి రెండు విడతలుగా 1,581 కోట్లును పంచాయతీల విద్యుత్తు ఛార్జీల బకాయిలకు ప్రభుత్వం సర్దుబాటు చేసింది. ఆస్తి పన్ను, ఇతర పద్దుల కింద వచ్చే సాధారణ నిధుల్లో నుంచి విద్యుత్తు ఛార్జీల బకాయిలు వసూలు చేస్తోంది.
ఈ పరిణామాలతో పంచాయతీలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సంపద తయారీ కేంద్రాల నిర్వహణ లేక మూతపడ్డాయి. ఒకప్పుడు వెలుగు వెలిగి పది మందికి సహాయపడిన ఈ కేంద్రాలు ఇలా మూతపడటం తమకెంతో బాధేస్తోందని గ్రామీణులు, మాజీ సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గతంలో సంపద సృష్టి కేంద్రాల నుంచి వానపాముల సహాయంతో తయారు చేసిన ఎరువు రైతులకు చౌకగా దొరికేది. తద్వారా రసాయనిక ఎరువులు స్థానంలో కంపోస్టు ఎరువులు వేసి ప్రకృతి వ్యవసాయం చేసేవారు. ప్రస్తుతం కేంద్రాలు మూతపడటంతో వేలకు వేలు వెచ్చించి రసాయనిక ఎరువులు వాడుతూ అప్పుల పాలు కావాల్సిన దుస్థితి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సంపద తయారీ కేంద్రాలతో గతంలో పంచాయతీలకు ఆదాయం రావడం వల్ల పంచాయతీలు ఆర్ధికంగా పరిపుష్టి అయ్యేవి. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల సంపద తయారీ కేంద్రాలు పాడు పడ్డాయని, వెంటనే నిధులు విడుదల చేయించి పునరుద్దరించి గ్రామీణుల ఆరోగ్యాన్ని కాపాడాలని కోరుతున్నారు.