నివర్ తుపాను వల్ల జరిగిన పంట నష్టం వివరాలను నమోదు చేయటంలో ప్రభుత్వం బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తోందని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు ఎవరూ రైతుల వద్దకు వెళ్లకుండా తూతూమంత్రగా తోచిన లెక్కలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంటల బీమా సొమ్ము చెల్లింపు, పంట నష్టం వివరాలు, రైతులకు సాయం విషయాల్లో వైకాపా సర్కార్ అబద్ధాలు చెబుతోందని శ్రీనివాస రెడ్డి విమర్శించారు.
ఇదీ చదవండి