వరి పంటకు ప్రభుత్వం కనీస మద్దతు ధర చెల్లించాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి డిమాండ్ చేశారు. 2636 రకం బస్తాకు 1416 రూపాయలు చెల్లించాల్సి ఉండగా.. కేవలం 1100 మాత్రమే చెల్లిస్తుండటంతో రైతులకు కన్నీళ్లే మిగులుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు భరోసా కేంద్రాల్లో పంటను కొనుగోలు చేయకపోవటం వల్ల మిల్లర్లు ధర తగ్గించి కొనుగోళ్లు చేస్తున్నారని ఆరోపించారు.
తేలిక రకం ధాన్యానికి కేవలం 800 రూపాయల నుంచి వెయ్యి మాత్రమే చెల్లిస్తున్నందున… ఎకరాకు 12వేల నుంచి 18వేల రూపాయల వరకు రైతులు నష్టపోతున్నారని గోరంట్ల చెప్పారు. ఖరీఫ్ సీజన్‌కు కస్టమ్, మిల్లింగ్ బకాయిలు వెయ్యి కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని అన్నారు. మంత్రుల ప్రకటనలకు, వాస్తవాలకు పొంతనలేదని విమర్శించారు.
ఇదీ చూడండి: