ETV Bharat / state

రైలు వెళుతుండగానే వేరైన ఇంజిన్.. అర కిలోమీటర్ దూరంలో బోగీలు - Mancherial Goods Train Bogies Separated

Goods Train Bogies Separated: తెలంగాణ మంచిర్యాల జిల్లా తాండూరు మండలం ఐబీ గేటు సమీపంలో గూడ్స్​ రైలు ఇంజిన్​ వెనుక కొన్ని బోగీలు విడిపోయాయి. ఇంజిన్ అర కిలోమీటర్​ దూరం ముందుకెళ్లింది. దానిని గమనించిన పైలెట్లు రైలు​ను వెంటనే ఆపేశారు.

రైలు వెళుతుండగానే వేరైన ఇంజిన్
రైలు వెళుతుండగానే వేరైన ఇంజిన్
author img

By

Published : Nov 28, 2022, 7:11 PM IST

Goods Train Bogies Separated: మంచిర్యాల జిల్లా తాండూరు మండలం ఐబీ గేటు సమీపంలో గూడ్స్​ రైలు ఇంజిన్​ వెనుక కొన్ని బోగీలు విడిపోయాయి. ఆ తరువాత ఇంజిన్ అర కిలోమీటర్​ దూరం ముందుకెళ్లింది. గమనించిన లోకో పైలెట్ ఇంజిన్​ను వెంటనే ఆపేశారు. ఈ విషయం తెలియడంతో.. బెల్లంపల్లి రైల్వే అధికారులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు.

సాంకేతిక సిబ్బంది బోగీలను ఇంజిన్​కు అమర్చారు. చిన్న చిన్న మరమ్మతుల అనంతరం మళ్లీ గూడ్స్​ రైలు ముందుకు కదిలింది. ఈ ఘటన జరిగిన 20 నిమిషాల వ్యవధిలోనే ఓ ఎక్స్​ప్రెస్ రైలు సాఫీగా వెళ్లిపోవడంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అసలు బోగీలు ఎందుకు విడిపోయాయోనని అధికారులు విచారణ చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.