దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పలు మార్గాల్లో నడిచే ప్యాసింజర్, ఎక్స్ ప్రెస్ రైళ్ల వేగం త్వరలో పెరగనునట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో అధికారులు రైలు ట్రాక్‌ను ఇప్పటికే సిద్ధం చేశారు. ప్రస్తుతం సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. పలు మార్గాల్లో రైళ్ల వేగం గంటకు 110 కిలోమీటర్లు ఉండగా.. దాన్ని ఇకపై గంటకు 130 కిలోమీటర్లకు పెంచనున్నారు.
పలు సెక్షన్లలో వేగం పెరుగుదల..
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని బల్హార్ష - కాజీపేట- విజయవాడ- గూడూరు, విజయవాడ- విశాఖపట్నం, అలాగే వాడి - గుత్తి-రేణిగుంట సెక్షన్లలోని రూట్లలో నడిచే పలు రైళ్ల వేగం పెరగనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సెక్షన్లలో స్వర్ణ చతుర్భుజి, స్వర్ణ వికర్ణ మార్గాలు ఉన్నాయి. ఈ మార్గాల్లో ట్రాక్ సామర్ధ్యాన్ని అంచనా వేసేందుకు అన్ని క్లాసులతో కూడిన 24 బోగీలు కలిగిన రైలును ట్రయల్‌గా నడిపింది.
సెప్టీ కమిషనర్‌కు నివేదిక..
వేగ పరీక్ష సహా వాటి సంబంధిత పనులు పూర్తయ్యక అన్ని మార్గాల్లో రైళ్ల వేగాన్ని గంటకు 130 కిలోమీటర్లు నడిపేందుకు వీలుగా రైల్వే సేఫ్టీ కమిషనర్‌కు నివేదిక ఇస్తారు.
ముందే గమ్యస్థానాలకు..
ప్రధాన సెక్షన్లలో రైళ్ల వేగం పెంపు వల్ల ప్రయాణికులు మరింత సమయం ముందే గమ్య స్థానాలకు చేరతారని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మరిన్ని ఎక్కువ సంఖ్యలో రైళ్లను నడపడం సాధ్యపడుతుందని యన వివరించారు. తద్వారా సరకు రవాణా రైళ్ల రాకపోకలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు.
ఇవీ చూడండి : 'అమరావతి'పై వాదనలు.. రిట్ పిటిషన్ల విభజనకు హై కోర్టు ఆదేశం