కృష్ణా జిల్లా కోడూరు మండలంలోని జరుగువానిపాలెం గ్రామానికి చెందిన కడవకొల్లు రాములు కుమార్తె నాగ పావని ఇంటి వద్ద పనులు చేస్తుండగా పాముకాటు వేసింది. వెంటనే అప్రమత్తమైన కుటుంబసభ్యులు చికిత్స నిమత్తం అవనిగడ్డ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది.
ఇదీ చదవండి:
కొవిడ్ మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షలు పరిహారమివ్వాలి: బాలకృష్ణ