ETV Bharat / state

జీజీహెచ్‌లో ఓపి తెరిచేనా..? రోగుల ఎదురుచూపులు - అవుట్‌ పేషెంట్‌ విభాగం విజయవాడ జీజీహెచ్

విజయవాడ జీజీహెచ్‌ను కొవిడ్‌ ఆసుపత్రిగా మార్చడంతో సాధారణ రోగులు, రోడ్డు ప్రమాద బాధితులకు వైద్యం అందడం లేదు. నిరుపేదల వైద్యశాల అయిన ప్రభుత్వ సార్వజన ఆస్పత్రిలో ఇప్పుడు సాధారణ వైద్య సేవలు అందక సామాన్య ప్రజలు అల్లాడిపోతున్నారు. త్వరగా ఓపీ సేవలు ప్రారంభించాలని కోరుతున్నారు.

vijayawda ggh
రోగుల ఎదురుచూపులు
author img

By

Published : Jun 13, 2021, 10:19 PM IST

విజయవాడ గుణదల ప్రాంతానికి చెందిన ఓ మహిళ అకస్మాత్తుగా అస్వస్థతకు గురైంది. దగ్గరలో ఉన్న జీజీహెచ్‌కు తీసుకెళ్లారు. అక్కడ చేర్చుకోమని చెప్పారు. ఈఎస్‌ఐ ఆస్పత్రికి వెళ్లినా ప్రవేశం లేదు. ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లే స్థోమత లేదు. అప్పటికప్పుడు ఆటోలో విజయవాడ నుంచి గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. ఈలోగా మహిళ మృతి చెందింది. గుండెపోటు రావడంతో మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. విజయవాడ జీజీహెచ్‌లో వైద్యం అందితే తమ అమ్మ బతికేదని కుమారుడు ఆవేదన వ్యక్తం చేశారు.

నిరుపేదల వైద్యశాల అయిన ప్రభుత్వ సార్వజన ఆస్పత్రిలో ఇప్పుడు సాధారణ వైద్య సేవలు అందడం లేదు. విజయవాడ జీజీహెచ్‌ను కొవిడ్‌ ఆసుపత్రిగా మార్చడంతో సాధారణ రోగులు, రోడ్డు ప్రమాద బాధితలకు వైద్యం అందడం లేదు. వారిని గుంటూరు ఆసుపత్రికి తరలించాలని చెబుతున్నారు. కొంతమంది స్థానికంగా ఉండే ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. కొంతమంది తప్పనిసరిగా గుంటూరు వెళ్తున్నారు. ప్రస్తుతం కొవిడ్‌ ఉద్ధృతి తగ్గింది. సగం పడకలు ఖాళీ ఉన్నాయి. అవుట్‌ పేషంట్‌ విభాగం ఖాళీగా ఉంది. పడకల కోసం వచ్చే వారి సంఖ్య తగ్గింది. జిల్లాలో శనివారం 392 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. విజయవాడ జీజీహెచ్‌తో పాటు బందరు జిల్లా ఆసుపత్రి ఖాళీగానే ఉంది. సాధారణ రోగులకు ఇక్కడ చికిత్స అందడం లేదు. కొన్ని పీహెచ్‌సీలు, ప్రాంతీయ ఆసుపత్రులు కొవిడ్‌ ఆసుపత్రులుగా మార్చారు. దీంతో ప్రస్తుతం అక్కడ కూడా చికిత్స అందడం లేదు. వెళితే ప్రైవేటు.. లేదంటే గుంటూరు అన్నట్లు పేదల పరిస్థితి తయారైంది.

పేదల పరిస్థితి..: విజయవాడలో జీజీహెచ్‌కు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఇక్కడ మొత్తం 830 పడకలు ఉన్నాయి. సూపర్‌స్పెషాలిటీ బ్లాక్‌ ఉంది. జిల్లా ఆసుపత్రి బందరులో ఉంది. విజయవాడ బోధనాసుపత్రి కావడంతో పీజీ విద్యార్థులు వైద్య సేవలు అందిస్తుంటారు. జీజీహెచ్‌లో సాధారణ పరిస్థితుల్లో ఓపీకి రోజుకు 2వేల నుంచి 2,500 మంది రోగులు వస్తుంటారు. ఇన్‌పేషంట్లుగా సుమారు 600 మంది సగటున ఉంటారు. రోజుకు 15 మందికి పైగా డయాలసిస్‌ నిర్వహిస్తుంటారు. కొవిడ్‌ మొదటి దశలో ఇక్కడ ఉన్న రోగులను పక్కనే ఉన్న ఈఎస్‌ఐ ఆసుపత్రికి తరలించి అక్కడ చికిత్స అందించారు. అవుట్‌ పేషెంట్‌ విభాగాన్ని అక్కడే నిర్వహించారు. కొవిడ్‌ రెండో దశ ప్రారంభానికి ముందు జిల్లా ఆసుపత్రిలో ఇన్‌పేషెంట్లుగా వివిధ విభాగాల్లో ఉన్న వారిని క్రమేపీ డిశ్ఛార్జ్‌ చేశారు. మరికొందరికి శస్త్రచికిత్స వాయిదా వేశారు. ఇలా మొత్తం 500 మందిని పంపించేశారు. కొంత మంది క్లిష్ట పరిస్థితుల్లో ఉండేవారు. వీరిని కూడా డిశ్ఛార్జ్‌ చేసి మొత్తం కరోనా రోగులకు కేటాయించారు.

రెండో దశ తొలి రోజుల్లో జీజీహెచ్‌లో పడకలు లభ్యం కావడం కష్టంగా మారింది. పైరవీలు ఉంటేనే పడక లభించేది. సాధారణ రోగులను గుంటూరు పంపేవారు. తర్వాత అటు వైపు రోగులు రావడం మానేశారు. ఇటీవల కరోనా ఉద్ధృతి కొంత తగ్గింది. సగం పడకలు ఖాళీగా ఉన్నాయి. బ్లాక్‌ఫంగస్‌ కేసులు ఎక్కువయ్యాయి. ప్రస్తుతం సాధారణ రోగులు గుంటూరు వెళ్లాలంటే వ్యయప్రయాసాలు పడుతున్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు ప్రతి నెలా, లేదా రెండు నెలలకు ఒకసారి వస్తుంటారు. అలాంటి వారికి ప్రస్తుతం అవకాశం లేదు. కుక్కకాటు, పాముకాటు, విద్యుదాఘాతం, ఇతర సీరియస్‌ సమస్యలపై చికిత్స ఆశించి వచ్చే వారు ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితి. కనీసం ఈఎస్‌ఐ ఆసుపత్రి అయినా ఓపీకి అవకాశమివ్వలేదు.

పునః ప్రారంభిస్తే పేదలకు మేలు

మూడో దశ ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుందో స్పష్టత లేదు. ప్రస్తుతం జిల్లాలో కరోనా పాజిటివిటీ శాతం తగ్గింది. ఎక్కువ మంది ఇంటి వద్ద చికిత్స తీసుకుంటున్నారు. దీంతో జీజీహెచ్‌లో కొన్ని బ్లాక్‌లు సాధారణ రోగులకు కేటాయించే అవకాశం ఉంది. కనీసం ఓపీ నిర్వహిస్తే పేదలకు అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. పాత ఆసుపత్రిలో గర్భిణులు, బాలింతలను చూస్తున్నారు. బందరులో 100 పడకలు మెటర్నటీకి కేటాయించారు. ఓపీ మాత్రం చూడటం లేదు. కొవిడ్‌ రోగులు లేకపోవడంతో సగం ప్రైవేటు ఆసుపత్రులను సాధారణ ఆసుపత్రులుగా మార్చారు. నిమ్రా, పిన్నమనేని కూడా ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. దీంతో సాధారణ ఓపీకి అవకాశం ఇవ్వాలనే ప్రతిపాదన చర్చనీయాంశమైంది.

ఇదీ చదవండి:

Srivari Temple in Jammu: జ‌మ్మూలో శ్రీ‌వారి ఆల‌య నిర్మాణానికి భూమిపూజ‌

ICC Test Rankings: అగ్రస్థానానికి న్యూజిలాండ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.