ETV Bharat / state

Gas Cylinder: వంటింటి గ్యాస్‌ మంట.. ఒకేసారి రూ. 25.50 పెంపు - గ్యాస్‌ ధరలు

గ్యాస్​ బండ బాదుడు మళ్లీ మొదలైంది. రెండు నెలలుగా నిలకడగా ఉన్న వంట గ్యాస్​ ధరలు.. ఒక్కసారిగా పెరిగాయి. 14.2 కిలోల సిలిండర్‌ ధరను కేంద్రం రూ.25.50 పెంచింది.

వంట ఇంట గ్యాస్‌ మంట
gas rates
author img

By

Published : Jul 2, 2021, 12:56 PM IST

పెట్రో ధరల బాటలోనే వంట గ్యాస్‌ ధరలూ భగ్గుమన్నాయి. గత రెండు నెలలుగా నిలకడగా ఉన్న వంట ఇంధనం ధరలు గురువారం ఒక్కసారిగా పేలాయి. గృహావసరాలకు వినియోగించే 14.2 కిలోల సిలిండర్‌ ధరను కేంద్రం రూ.25.50 పెంచింది. బుధవారం వరకు దీని ధర రూ.861.50 ఉండగా.. ఇప్పుడు రూ.887కు చేరింది. అలానే 19 కిలోల వాణిజ్య వినియోగ సిలిండర్‌పై రూ.84.50 పెంచారు. దీని ధర రూ.1730.50కి చేరింది. పెట్రోలు, డీజిల్‌ తరహాలోనే దూరం ఆధారంగా వీటి ధరల్లో మార్పులు ఉంటాయి. హైదరాబాద్‌లో వంట గ్యాస్‌ సిలిండరు ధర రూ.887కు చేరగా.. ఆదిలాబాద్‌ జిల్లాలో అత్యధికంగా రూ.911.50కు పెరిగింది.

ఇప్పటికే పెట్రోలు, డీజిల్‌ ధరలు సెగలు కక్కుతుండగా.. తాజాగా వంట గ్యాస్‌ ధర భగ్గుమనటంతో సామాన్యుడు ఆర్థికంగా మసకబారిపోతున్నాడు. కరోనా ముప్పేట దాడితో ఆర్థికంగా అతలాకుతలం అవుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్‌ ధరలను పెంచడంతో ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది.

తెలంగాణ రాష్ట్రంలో 1.09 కోట్ల గృహావసరాల వంట గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. ప్రతి నెలా సుమారు 60 నుంచి 65 లక్షల గృహావసరాల గ్యాస్‌ సిలిండర్లను చమురు సంస్థలు వినియోగదారులకు సరఫరా చేస్తున్నాయి. తాజాగా పెరిగిన ధరతో ఈ నెలలో వంట గ్యాస్‌ వినియోగదారులపై రూ.16 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు అదనపు భారం పడుతుందని అంచనా. గృహ వినియోగదారులకు రాయితీగా గత రెండు నెలలుగా రూ.39 జమ చేస్తున్నారు. ప్రస్తుతం ధర పెరిగిన నేపథ్యంలో ఎంత జమ చేసేదీ చమురు సంస్థలు ఇంకా ప్రకటించలేదు.

రూ.వందకు చేరువలో డీజిల్‌ ధర

పెట్రోలు, డీజిల్‌ ధరలు రోజువారీగా పెరుగుతూ వాహనదారులపై భారం మోపుతున్నాయి. లీటరు డీజిల్‌ ధర వంద రూపాయల దిశగా పరుగులు తీస్తోంది. గురువారం లీటరు డీజిల్‌ ధర రూ.97.20కు చేరింది. పెట్రోలు ధర రూ.102.69గా ఉంది.

ఇదీ చూడండి:

petrol price: మరోసారి పెరిగిన పెట్రోల్‌ ధర.. లీటర్ @ 105.17

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.