అవనిగడ్డలో లాక్ డౌన్ సమయంలో నిత్యావసరాల కోసం ఇబ్బంది పడుతున్నపేద కుటుంబాలకు విజయకృష్ణా గ్యాస్ ఎంటర్ ప్రైజెస్ ప్రతినిధులు కూరగాయలు పంపిణీ చేశారు. అవనిగడ్డ సుగాలీ కాలనీలో మాజీ ఉప సభాపతి బుద్ధప్రసాద్ తనయుడు మండలి వెంకట్రాం, అవనిగడ్డ సీఐ భీమేశ్వర రవికుమార్.. పేదలకు కూరగాయలు పంపిణీ చేశారు.
దివి ప్రాంతంలో ప్రజలు సమస్యల్లో ఉన్న ప్రతీ తరుణంలోనూ మండలి కుటుంబం, ఆ కుటుంబ అభిమానులు అండగా నిలుస్తారని రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షుడు మత్తి శ్రీనివాసరావు, మాజీ జడ్పీటీసీ సభ్యుడు కొల్లూరి వెంకటేశ్వరరావు, తెదేపా అధ్యక్షుడు యాసం చిట్టిబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో గాజుల మురళీకృష్ణ, పిరాటి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: