విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దెరామ్మోహన్ కృష్ణలంకలోని పలు డివిజన్లలో కూరగాయలను పంపిణీ చేశారు. రెడ్ జోన్ ప్రాంతాల్లో ప్రజలు నిత్యావసరాలకోసం ఇబ్బందులు పడుతున్నారన్న ఆయన.. ఆ ప్రాంతంలోని ప్రతీ ఇంటికీ కూరగాయలను అందించారు. ప్రభుత్వం అందిస్తున్న మాస్కులు, సానిటైజర్లు .. పేద, బడుగు వర్గాల వారు నివసించే ప్రాంతాల్లో అందడం లేదన్నారు. అందుకే ఈ ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని ఆరోపించారు. లాక్డౌన్ పూర్తయ్యే వరకు రెడ్ జోన్ ప్రాంతాల్లో కూరగాయలు పంపిణీ చేస్తామని తెలిపారు.
ఇవీ చదవండి: రేపు.. రాష్ట్రవ్యాప్తంగా 58 లక్షల మందికి పింఛన్లు