.
తహసీల్దార్‌పై సాధారణ పరిపాలన శాఖ కమిషనర్ ఆగ్రహం - కృష్ణా జిల్లా తాజా వార్తలు
కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాలలో సాధారణ పరిపాలన శాఖ కమిషనర్ ప్రవీణ్‌ప్రకాశ్, కలెక్టర్ ఇంతియాజ్, జాయింట్ కలెక్టర్ మాధవీలత పర్యటించారు. పేదలకు ప్రభుత్వం కేటాయించే ఇళ్ల స్థలాల భూములను పరిశీలించారు. తహసీల్దార్ రాజకుమారి అధికారులకు సరైన సమాచారం చెప్పకపోవడం వల్ల ప్రవీణ్ ప్రకాశ్... ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రాధాన్యతను లెక్క చేయకుండా ఎలా విధులు నిర్వహిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.
తహసీల్దార్‌పై సాధారణ పరిపాలన శాఖ కమిషనర్ ఆగ్రహం
.
sample description