కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం దొనబండ ప్రాంతంలో గంజాయి సరఫరా, విక్రయాలు జరుపుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి సుమారు పది కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. చింతపల్లికి చెందిన బేస్ అనే వ్యక్తి గంజాయి అక్రమ రవాణాకు సూత్రధారి అని నందిగామ డిఎస్పీ జి.వి.రమణమూర్తి తెలిపారు.
హైదరాబాద్ కు చెందిన బుర్ర కృష్ణమోహన్, గుంటూరు జిల్లా మంగళగిరి కి చెందిన సత్తుపల్లి గోపి అనే ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులతో గంజాయి విక్రయిస్తున్నట్లు చెప్పారు. సికింద్రాబాద్ కు చెందిన కొల్లి భరత్ రెడ్డి, బెంగళూరుకు చెందిన షమీనా జోసఫ్ అనే ఇద్దరు వ్యక్తులు కంచికచర్ల మండలం దొనబండలో ఇంజినీరింగ్ చదువుతున్నారని పేర్కొన్నారు. ప్రధాన నిందితుడు బేస్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని పట్టుబడిన నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు డిఎస్పీ తెలిపారు. రెండు ద్విచక్ర వాహనాలు, నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి