Fishermen safe: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 6 రోజుల క్రితం అంతర్వేది సముద్ర తీరంలో గల్లంతైన నలుగురు మత్స్యకారుల ఆచూకీ ఎట్టకేలకు లభించింది. గల్లంతైన నలుగురు మత్స్యకారులు అమలాపురం సమీపంలోని కొత్తపాలెం వద్ద సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. ఒడ్డుకు చేరిన మత్స్యకారులు.. కుటుంబసభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు.
ఆరు రోజులు క్రితం క్యాంబెల్‌పేటకు చెందిన జాలర్లు విశ్వనాథపల్లి చినమస్తాన్, రామాని నాంచార్లు, చెక్క నరసింహారావు, మోకా వెంకటేశ్వరరావు చేపల వేట కోసం అంత్వర్వేది వైపు వెళ్లారు. అప్పటినుంచి వీరి ఆచూకీ లేకుండా పోయింది. కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడంతో..అధికారులు గాలింపు చేపట్టారు. ఇవాళ ఒంటి గంట సమయంలో వీరు కొత్తపాలెం వద్ద ఒడ్డుకు చేరుకున్నారని కృష్ణా జిల్లా ఇంఛార్జ్ కలెక్ట్‌ర తెలిపారు. మత్స్యకారులను స్వస్థలానికి తీసుకువస్తామని చెప్పారు.
ఇదీ చదవండి :