ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఆదేశాల కృష్ణా జిల్లా నందిగామలో పోలీసులు తనిఖీలు చేశారు. తెలంగాణ నుంచి రాష్ట్రంలోకి అక్రమంగా తరలిస్తున్న గుట్కా, రెండు కేజీల గంజాయిని పట్టుకున్నారు. నిందితులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి రెండు బైకులను స్వాధీనం చేసుకున్నారు.
![నందిగామలో గుట్కా పట్టివేత](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9811566_1004_9811566_1607440580900.png)
వీరులపాడు మండలంలో పెద్దాపురం గూడెం, మాధవరం జయంతి గ్రామాల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని నందిగామ రూరల్ సీఐ సతీష్ తెలిపారు. నిషేధిత గుట్కా, గంజాయి, ఇసుక వంటివి అక్రమంగా రవాణా చేస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కంకిపాడులో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు యువకుల నుంచి 4కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
![కంకిపాడులో ఇద్దరు అరెస్ట్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9811566_806_9811566_1607440627710.png)
ఎస్పీ అన్బురాజన్ ఆదేశాల మేరకు కడప జిల్లా రైల్వేకోడూరులో ఎస్ఈబీ అధికారులు తనిఖీలు చేశారు. ఎస్.ఉప్పరపల్లి సమీపంలో 348 కర్ణాటక మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అరెస్ట్ చేశారు. నిందితులను రేపు నందలూరు కోర్టులో హాజరుపరుస్తామని కోడూరు ఎస్ఈబీ ఇన్స్పెక్టర్ రామ్మోహన్ తెలిపారు.
ఇవీ చదవండి