ఇసుక తవ్వకాలు ఆపాలని రైతుల నిరసన కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం చింతలపాడు పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలు ఆపాలంటూ రైతులు నిరసన తెలిపారు. రెండు అడుగుల మేరకు అనుమతి తీసుకొని సుమారు పది అడుగుల వరకూ ఇసుక తవ్వుతున్నారని ఆరోపించారు. ఇసుక తవ్వకాల వల్ల భూగర్భ జలాలు తగ్గిపోవటంతో పంటలు నష్ట పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తవ్వకాలు నిలిపేసి.. న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: "ఉపాధి హామీ పథక నిధులను వెంటనే చెల్లించండి"