రాజకీయ విద్వేషంతో ప్రతిపక్ష నాయకులపై పెడుతున్న కేసుల విషయంలో పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు సూచించారు. మచిలీపట్నం వైకాపా నాయకుడు మోకా భాస్కరరావు హత్యకేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్రను నిందితుడిగా పేర్కొనడాన్ని కొనకళ్లతోపాటు మాజీ మంత్రి నడకుదిటి నరసింహారావు తప్పుబట్టారు.
వైకాపా ప్రభుత్వం తెదేపా నాయకులపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిందని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య విరుద్ధపాలన జరుగుతుందని విమర్శించారు. మోకా భాస్కరరావు హత్యకేసులో అసలు నిందితులను పట్టుకునే విషయంలో తమవంతు సహకారం అందిస్తామన్నారు. రాజకీయ కారణాలతో కొల్లు రవీంద్రపై కేసు బనాయించాలని చూడటం సరికాదని హితవు పలికారు.
ఇదీ చదవండి : అక్కయ్యపాలెం సాయిబాబా గుడిలో కత్తితో వ్యక్తి హడావుడి