పెరిగిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని కోరుతూ కృష్ణా జిల్లా నందిగామ విద్యుత్ శాఖ ఏడీఈ కార్యాలయలో.. మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య వినతిపత్రం అందించారు. 2 నెలల బిల్లులను మాఫీ చేయాలని విజ్ఞప్తి చేశారు. లాక్ డౌన్‌తో పేద, బడుగు బలహీన వర్గాలు, మధ్యతరగతి ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారని.. జీవనం సాగించడమే కష్టమైన నేపథ్యంలో అంతంత కరెంట్ బిల్లులు ఎలా కడతారని ప్రశ్నించారు.
గత ఎన్నికల ప్రచారంలో వైకాపా ఇచ్చిన ఉచిత కరెంట్ హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. విద్యుత్ బిల్లులను పాత పద్ధతిలోనే కొనసాగించాలని.. లేనిపక్షంలో ప్రజల పక్షాన తెదేపా న్యాయపోరాటం చేస్తుందని స్పష్టంచేశారు.
ఇవీ చదవండి.. కేంద్ర ప్రభుత్వ ప్రకటనతో కృష్ణా జిల్లాకు ప్రయోజనాలు