Former MLA Jaleel Khan: మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌పై మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో మంత్రి వెల్లంపల్లి తీరు 'సొమ్ము ఒకరిది.. సోకు ఒకరిది' అన్న చందంగా తయారైందని ఎద్దేవా చేశారు. తెదేపా హయాంలో నిర్మించిన నిర్మాణాలకు రంగులు వేసి తామే నిర్మించామని వైకాపా నాయకులు గొప్పలు చెప్పుకొంటున్నారని మండిపడ్డారు. కోట్ల రూపాయలతో తెదేపా హయాంలో షాదీఖానా నిర్మిస్తే.. దాన్ని ఇప్పటి వరకూ పూర్తి చేయలేదని ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో వెల్లంపల్లికి డిపాజిట్ కూడా రాదని అన్నారు. నియోజకవర్గంలో ఆయన చేసిన అక్రమాలు ఏ నాయకుడూ చేయలేదన్నారు. దేవాలయాల అభివృద్ధికి కృషి చేసిన వ్యక్తి చంద్రబాబు అని.. దేవాలయాలను దోచుకుంటున్న వ్యక్తి మంత్రి వెల్లంపల్లి అని దుయ్యబట్టారు. అసలు నియోజకవర్గ అభివృద్ధికి వెల్లంపల్లి ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు.
ఇదీ చదవండి: ఆర్బీకేల్లో వసతులపై బహిరంగ చర్చకు సిద్ధమా ?: మర్రెడ్డి
"వచ్చే ఎన్నికల్లో వెల్లంపల్లికి డిపాజిట్లు కూడా రావు" - ఏపీ రాజకీయ వార్తలు
Former MLA Jaleel Khan: వెల్లంపల్లి శ్రీనివాస్ తీరు 'సొమ్ము ఒకరిది.. సోకు ఒకరిది' అన్నట్లుగా ఉందని మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో వెల్లంపల్లికి డిపాజిట్ కూడా రాదని జోస్యం చెప్పారు. తెదేపా హయాంలో నిర్మించిన నిర్మాణాలకు రంగులు మార్చి తామే కట్టామని.. వైకాపా నాయకులు గొప్పలు చెప్పుకొంటున్నారని విమర్శించారు.