కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడులో.. మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ కు చెందిన ఓ వెంచర్.. అనధికారికంగా వేశారంటూ సీఆర్డీఏ అధికారులు అభ్యంతరం చెప్పారు. అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన బోడె ప్రసాద్.. గతంలో తక్కువ ధరకే భూమిని కొని.. తక్కువ ధరకే పేదలకు అమ్మినట్టు చెప్పారు. ఈ వెంచర్ అనధికారికం కాదని చెప్పడమే కాక.. రిజిస్ట్రేషన్ పత్రాలనూ చూపించారు. కక్ష పూరితంగానే తన వెంచర్ పైకి అధికారులను పంపించారని ఆరోపించారు.
ఇది చూడండి: 15 రోజుల్లో ఇద్దరు మాజీ సీఎంలు కన్నుమూత