కృష్ణా జిల్లా కంకిపాడులో తెదేపా మండల పార్టీ కార్యాలయంలో మాజీఎమ్మెల్యే బోడె ప్రసాద్ సమావేశం నిర్వహించారు. ఓవైపు పేదలు ఆకలితో అలమటిస్తుంటే అన్న క్యాంటీన్లు తెరవాల్సింది పోయి మద్యం దుకాణాలు తెరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి సమయంలో పేదలను ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం మద్యం విడుదల చేసి వారి రక్తాన్ని పీల్చుకుంటున్నారంటూ మండిపడ్డారు. నిరుపేదలకు ప్రభుత్వం కేటాయిస్తున్న రూ.1000ని రూ. 5000 చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
విశాఖపట్నంలోని గోపాలపట్నం పరిధిలోని ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో జరిగిన ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబసభ్యులకు రూ.25 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.