ETV Bharat / state

'శాంతియుతంగా ఉద్యమించే వారిని అరెస్ట్ చేయడం దారుణం' - former minister peethala sujatha news

అమరావతిలో శాంతియుతంగా నిరసన చేస్తున్న మహిళలు, రైతులను అరెస్ట్​ చేయటం దారుణమని మాజీమంత్రి పీతల సుజాత మండిపడ్డారు. వారిపై వైకాపా ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టి అవమానిస్తోందని ఆరోపించారు.

former minister peethala sujatha
మాజీమంత్రి పీతల సుజాత
author img

By

Published : Nov 1, 2020, 2:34 PM IST

"రాజధాని కోసం శాంతియుతంగా ఉద్యమిస్తున్న మహిళలను ప్రభుత్వం హింసించడం దారుణం" అని మాజీ మంత్రి పీతల సుజాత ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం కోసం ప్రశ్నించే రైతులు, మహిళలు, దళితులను హింసిస్తారా అని వైకాపాపై ధ్వజమెత్తారు. సర్కారు అమానుష చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. పోలీసులకు ప్రభుత్వంపై అభిమానం ఎక్కువైతే, వారు ఉద్యోగాలు వదిలి వైకాపాలో చేరాలని సూచించారు.

రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసం భూములివ్వడమే రైతులు చేసిన నేరమా అని ప్రశ్నించారు. ప్రభుత్వం హేయమైన చర్యలకు పాల్పడుతుందని దుయ్యబట్టారు. రైతులు, మహిళలకు ముఖ్యమంత్రి బేషరతుగా క్షమాపణ చెప్పి, వారిపై పెట్టిన కేసులన్నీ ఎత్తేయాలని డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి:

'నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.