కృష్ణా జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోని గుడివాడ గ్రామీణం చిరిచింతలలో మాజీ హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు వారి పొలం వద్ద ఘర్షణలో గాయపడి మృతి చెందాడు.
వెంకటేశ్వరరావుకు కొంతకాలంగా... పక్క గ్రామనికి చెందిన కృష్ణకు భూవివాదం జరుగుతోంది. అది కాస్త పెద్దదై గురువారం పొలం వద్ద ఇరువురు ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో వెంకటేశ్వరరావుకు తీవ్రగాయాలు కాగా స్థానికులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వెంకటేశ్వరరావు మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: