కృష్ణా జిల్లా కొండూరు మండలం గడ్డమణుగు రోడ్డులో ప్రమాదం జరిగింది. బైక్‌పై ఆగి ఉన్న ఫారెస్ట్ అసిస్టెంట్ బీట్ అధికారిని... వెనుక నుంచి ట్రాక్టర్ ఢీకొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందారు. రోడ్డుపై వాహనాల పార్కింగ్తోనే ప్రమాదం జరిగిందని స్థానికులంటున్నారు.
జగ్గయ్యపేటకు చెందిన పుట్టబంతి శివకుమార్... విజయవాడ ఫారెస్ట్ రేంజ్, కొండపల్లి సెక్షన్ పరిధిలో అసిస్టెంట్ బీట్ ఆఫీసర్గా పని చేస్తున్నారు. విధి నిర్వహణలో ఉండగా.. రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారని స్థానికులు తెలిపారు. మృతునికి భార్య, ఐదేళ్ల కుమార్తె ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి