విజయవాడ నగర శివారులోని గొల్లపూడి, భవానిపురం ప్రాంతాల్లో ఉన్న వంటనూనెల తయారీ, ప్యాకింగ్ పరిశ్రమలపై రెవెన్యూ, విజిలెన్స్, ఆహార భద్రత శాఖ అధికారులు అకస్మిక తనిఖీలు నిర్వహించారు. విజయవాడ ప్రాంతీయ భద్రతాధికారి పూర్ణ చంద్రరావు ఆధ్వర్యంలో నాలుగు బృందాలుగా ఏర్పడిన సభ్యులు.. అనుమతులు లేకుండా నగర శివారులోని వివిధ ప్రాంతాల్లో నడుపుతున్న వంట నూనె ప్యాకింగ్ పరిశ్రమలను గుర్తించారు.
వివిధ పప్పుల మిల్లుల్లో నిషేధిత రంగులు కలిపి మార్కెట్లో అమ్మకానికి తరలించేందుకు సిద్ధంగా ఉంచిన కందిపప్పు, మినప్పప్పు, పెసర పప్పుల నిల్వలను అధికారులు గుర్తించారు. వీటి శాంపిళ్లను సేకరించి ల్యాబ్‌లకు పంపుతున్నట్లు వారు తెలిపారు. నివేదిక రాగానే వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆహార భద్రత శాఖ అధికారి తెలిపారు.
ఇదీ చదవండి: