ETV Bharat / state

Food Processing Industries Towards Closure: 'అన్నీ ఉన్నా సహకారం సున్నా'.. జగన్​ పాలనలో మూసివేత దిశగా ఆహారశుద్ధి పరిశ్రమలు

Food processing industries towards closure: అవసరమైన చోటల్లా ఆహారశుద్ధి పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని ప్రతిపక్షనేతగా హామీ ఇచ్చిన జగన్‌... సీఎం కాగానే ఆ మాట మరిచారు. కొత్తగా శుద్ధి పరిశ్రమలను ఏర్పాటు చేయకపోగా... ఉన్న వాటికి సైతం నాలుగేళ్లుగా ప్రోత్సాహకాలు ఇవ్వలేదు. సుమారు రూ.400 కోట్ల బకాయిల కోసం పారిశ్రామికవేత్తలు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం అండ లభించక పరిశ్రమలు మూతపడే పరిస్థితి రాగా.. పంటలకు గిట్టుబాటు ధర రైతులకు కలగానే మిగిలిపోయింది.

Food_processing_industries
Food_processing_industries
author img

By

Published : Aug 6, 2023, 12:54 PM IST

Food_processing_industries

Food processing industries: అవసరమున్న ప్రతిచోటా ఆహారశుద్ధి పరిశ్రమలు ఏర్పాటుచేస్తాం.. 2018 మే 23న పశ్చిమగోదావరి జిల్లా గణపవరంలో జగన్‌ ఇచ్చిన హామీ ఇది. దీనికన్నా ముందు 2017 డిసెంబర్‌లో చిత్తూరు జిల్లాలో టమోటా రైతులతో సమావేశం సందర్భంగా.. అధికారంలోకి వస్తే ప్రతి మండలంలో శీతల గోదాములు, టమోటా గుజ్జు తీసే ఆహారశుద్ధి పరిశ్రమలు పెట్టిస్తామని చెప్పారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చారు. నాలుగేళ్లు దాటిపోయింది. అయినా ఆ దిశగా కార్యాచరణ చేపట్టిన దాఖలాల్లేవు.

PRATHIDWANI పరిశ్రమలు తరలిపోవడం ప్రభుత్వ వైఫల్యం కాదా

CM Jagan పంటలకు గిట్టుబాటు ధర దక్కడం లేదని, తాము అధికారంలోకి వస్తే ఆహారశుద్ధి పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని చెప్పిన జగన్‌... ముఖ్యమంత్రి కాగానే రైతులకు మొండిచేయి చూపారు. కొత్తగా ఆహారశుద్ధి పరిశ్రమల ఏర్పాటు అటుంచి.. ఇప్పటికే ఉన్న వాటికీ నాలుగేళ్లుగా పారిశ్రామిక ప్రోత్సాహకాలు విడుదల చేయకుండా సతాయిస్తున్నారు. జగన్ అధికారం చేపట్టిన 2019 - 20 తర్వాత నుంచి రాయితీలివ్వడం మానేశారు. సుమారు 400 కోట్ల బకాయిలు చెల్లింపు నిలిపేశారు. ఏటా ఇదిగో-అదిగో అనడం తప్ప.. విద్యుత్ బిల్లుల భారం తడిసి మోపెడవుతున్నా పట్టించుకునే పరిస్థితి లేదు. ఆర్థిక పరిస్థితి తలకిందులై బకాయిలు చెల్లించలేక, పరిశ్రమలు ఎన్​పీఏలుగా మారుతున్నాయి.

Ferro Industries Shutdown: ఫెర్రో పరిశ్రమలకు విద్యుత్​ షాక్​.. బెంగతో కుంగిపోతున్న కార్మికులు..

Affordable price for farmers వ్యవసాయ ఉత్పత్తులకు అదనపు విలువ జోడిస్తే రైతులకు గిట్టుబాటు ధర దక్కుతుంది. ముఖ్యంగా టమోటా, జీడి, మామిడి, మిరపతో పాటు ఆక్వా రంగాల్లో ఆహారశుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. దేశంలో టమోటా ఉత్పత్తిలో మనది రెండో స్థానం. ఎండు మిరప, అరటి, మామిడి, బొప్పాయి, బత్తాయి, నిమ్మ పండ్ల ఉత్పత్తి, ఆక్వా, మాంసం ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ అగ్రస్థానంలో ఉంది. చిరు ధాన్యాలపై రైతులు కొన్నేళ్లుగా ఎక్కువ దృష్టి పెడుతున్నారు. వీటి ఆధారంగా పరిశ్రమల ఏర్పాటుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. బిస్కెట్లు, కుకీలు, తీపి పదార్థాలతోపాటు పిండి, ఫ్లాక్స్, నూడుల్స్ తయారు చేయవచ్చు. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఆహారశుద్ధి పరిశ్రమల ఏర్పాటులో మొక్కుబడిగానే వ్యవహరిస్తోంది. ఇప్పటికే ఉన్న పరిశ్రమలకు ప్రోత్సాహకాల విడుదలలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుండటంతో... ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కొత్తవి ఏర్పాటు చేసేందుకు వెనక్కి తగ్గుతున్నారు.

industries subsidies Payment వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆహారశుద్ధి పరిశ్రమలకు రాయితీల చెల్లింపు ఊసే లేదు. ప్రభుత్వం ప్రోత్సాహకాలు విడుదల చేయకపోవడంతో... చిన్న పరిశ్రమల యజమానులు విలవిల్లాడుతున్నారు. అప్పులు తెచ్చి బ్యాంకు రుణాలకు వడ్డీలు కట్టాల్సి వస్తోందని వాపోతున్నారు. ఏటా టోకెన్లు ఇవ్వడం, చెల్లింపులు నిలిపేయడం తప్ప ఒరగబెట్టిందేమీ లేదు. ఒక్కో పరిశ్రమకు ప్రోత్సాహకంగా 1.25 కోట్లకు పైగా రావాల్సి ఉంది. ఉత్పత్తుల ఆధారంగా ఒక్కోదానికి 5% నుంచి 12% వరకు జీఎస్టీ విధిస్తున్నారు. ఇందులో సగం రాష్ట్ర జీఎస్టీ ఉంటుంది. ఒక పరిశ్రమ ద్వారా రూ.50 కోట్ల వ్యాపారం చేస్తే... అందులో ఎస్​జీఎస్​టీ 6శాతం మినహాయింపు ఇవ్వాలి. అంటే 3 కోట్ల అన్నమాట. పరిశ్రమ వర్గాలకు ఒక్క ఫోన్‌ కాల్‌ దూరంలో ఉంటానని చెప్పే సీఎం జగన్‌... కనీసం అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వని పరిస్థితి ఉంది.

Electricity charges గతంతో పోలిస్తే చిన్న పరిశ్రమల ఉత్పాదక వ్యయం భారీగా పెరిగింది. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు అందకపోవడంతో మూలధన వ్యయం తగ్గింది. విద్యుత్ ఛార్జీల రూపంలోనే ఆహారశుద్ధి పరిశ్రమలపై 30శాతం భారం పడింది. తెలంగాణతో పోలిస్తే యూనిట్‌ రెండున్నర వరకు అధికంగా ఉంది. ముడిసరుకుల ధరలు పెరిగాయి. ఆదాయం లేకపోవడంతో బ్యాంకు వడ్డీలు కూడా చెల్లించలేక చేతులెత్తేశారు. గతంతో పోలిస్తే డీజిల్ ధర లీటరుకు రూ.40 వరకు పెరిగింది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే డీజిల్ ధరలూ ఏపీలోనే ఎక్కువే. దీంతో రవాణా వ్యయం తడిసి మోపెడవుతోంది.

industries incentives గతేడాది రాయితీలు లేవు..! ఈసారైనా బటన్ నొక్కుతారని ఎదురు చూస్తున్న పారిశ్రామిక వేత్తలు!

TDP giant in the field of food hygiene తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2014 నుంచి 2019 వరకు ఆహారశుద్ధి రంగానికి పెద్దపీట వేశారు. ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖ ఏర్పాటుచేశారు. అప్ప టికే ఉన్న బకాయిలతో పాటు ఏటా క్రమం తప్పకుండా రాయితీలు విడుదల చేశారు. దీనివల్ల మరింత మంది పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకొచ్చారు. కేంద్రం 60శాతం వాటా ఇస్తుండగా, రాష్ట్రం 40 శాతం చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం మాత్రం... కేంద్రం నుంచి వచ్చిన నిధులనూ ఇవ్వడం లేదు. తెలుగుదేశం హయాంలో ఫుడ్‌పార్కులు ఏర్పాటు చేసేవారికి రాష్ట్రమే సొంతంగా రాయితీలిచ్చి ప్రోత్సహించింది. అందువల్ల సుమారు 10కిపైగా పార్కులు ఏర్పాటయ్యాయి. మరికొన్ని పట్టాలెక్కించేందుకు సిద్ధంగా ఉన్న తరుణంలో ప్రభుత్వం మారింది. పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చినా సర్కార్‌ నుంచి ప్రోత్సాహం లేకపోవడంతో... పలువురు తమ ప్రతిపాదనలను విరమించుకున్నారు.

Agro Processing Cluster Project రాష్ట్రంలో 'సీఈఎఫ్ పీవీసీ - ఆహారశుద్ధి, మల్లవల్లి పార్కులో సంరక్షణ సామర్థ్యాల పెంపు' పథకం కింద.... మొత్తం 11 ప్రాజెక్టులు మంజూరు కాగా రెండు పూర్తి చేశారు. ఆగ్రో ప్రాసెసింగ్ క్లస్టర్ ప్రాజెక్టుల్లో మౌలిక వసతులకు సంబంధించి నాలుగు మంజూరు కాగా... ఒక్కటీ పూర్తి కాలేదు. ఆహారశుద్ధి పరిశ్రమల ఏర్పాటులోనూ వెనుకబడే ఉంది. గత ఏడాది 8 మంజూరు చేయగా... ఒకటి మాత్రమే పూర్తయిందని కేంద్ర నివేదికలు వెల్లడిస్తున్నాయి. మల్లపల్లి పారిశ్రామిక పార్కులో కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన పరిశ్రమలు కూడా ప్రభుత్వ మొండి వైఖరితో మూతపడే పరిస్థితి తలెత్తింది. ప్రభుత్వ ప్రోత్సాహం లభించే అవకాశంలేక వ్యాపారులు ఇతర ప్రాంతాలకు తరలివెళ్లారు.

Industries in AP: వైఎస్సార్​సీపీ ఎంపీకే వ్యాపారం చేయలేని పరిస్థితి.. వెళ్లిపోతున్న పరిశ్రమలు.. ఇది జగనన్న పాలన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.