కృష్ణాజిల్లా.. అవనిగడ్డ తహసీల్దార్ కార్యాలయం వద్ద మండలంలోని 150 పేద కుటుంబాలకు తొమ్మిది రకాల నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. దివి మార్కెట్ యార్డ్ చెర్మన్ కనవకొల్లు నరసింహారావు చేతుల మీదుగా ఈ సరకులను అందించారు. జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి ఈ సరకులు వచ్చినట్లు అవనిగడ్డ తహసీల్దార్ మస్తాన్ తెలిపారు. లబ్ధిదారులు కృష్ణాజిల్లా కలెక్టర్కు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండి: కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు