ETV Bharat / state

పర్యటకులకు మేం రక్ష... మాకు రక్ష ఎవరు? - హంసలదీవి తాజా వార్తలు

మత్స్యకారులకు సముద్రమే జీవనాధారం! ఆ కడలి ఆటుపోట్లకు తట్టుకుంటూ వారు కాపాడిన ప్రాణాలెన్నో! సముద్రం లోతెంతున్నా... ప్రాణాలు పణంగా పెట్టి తోటి మనుషులను కాపాడటంలో వాళ్లకి సాటి ఎవ్వరుండరూ! తీరానికి వచ్చే పర్యటకులను రక్షించడంలో ఒకడుగు ముందుండి సహాయం చేస్తే... వారి ప్రాణాలు మాత్రం పట్టించుకున్నావారే నాథులే ఉండరు.

పాలకాయతిప్పలో మత్స్యకారులు
author img

By

Published : Nov 21, 2019, 2:45 PM IST

కృష్ణాజిల్లా, కోడూరు మండలం కృష్ణావన్యప్రాణి అభయరణ్య పరిధిలో ఉన్న పాలకాయతిప్ప తీరానికి వందల మంది పర్యటకులు వస్తుంటారు. మడచెట్లు, అరుదైన వన్య ప్రాణులతో ఇక్కడ ఉన్న ప్రకృతి అందాలు చాలా అద్భుతంగా ఉంటాయి. సినిమా షూటింగ్‌లూ జరుగుతున్నాయి. ఈ బీచ్‌కు 3 కిలోమీటర్ల దూరంలోనే హంసలదీవి ఉంది.
సూచన బోర్డులు లేకే .. చాలామంది మరణిస్తున్నారు

సెలవు రోజుల్లో ఒక్కో రోజుకు సుమారు 2 వేల మంది పర్యటకులు వస్తారు. సాగర సంగమం వద్ద సూచిక బోర్డుల్లేక నదిలో దిగి చాలా మంది మృత్యువాత పడుతున్నారు. ఇక్కడ సముద్రం చాలా ఉద్దృతంగా ఉంటుంది. 5 అడుగుల దూరంలో 50 అడుగుల లోతు ఉంటుంది. ఇక్కడ దిగితే బ్రతకడం చాలా కష్టం.

మాకు రక్షణ కల్పించండి..

తరచూ ఇక్కడ ప్రమాదాలు జరుగుతుంటాయి. కొన్ని సందర్భాల్లో మత్స్యకారులే ప్రాణాలకు తెగించి సందర్శకులను రక్షిస్తుంటారు. గత పదేళ్లలో ఇప్పటికి సుమారు 15 మందికిపైగా చనిపోయారు. వందల మందిని అక్కడే ఉండే మత్స్యకారులు రక్షించారు. ఈ ప్రయత్నంలో తమ ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోందంటున్నారు జాలర్లు. అగ్నిమాపక, మెరైన్ శాఖ ద్వారా తమకు లైఫ్‌జాకెట్స్, రింగ్స్ ఇవ్వాలని కోరుతున్నారు. ప్రమాదం జరిగే ప్రాంతాల వద్ద గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయాలని పర్యటకులు కోరుతున్నారు.

పర్యటకులకు మేం రక్ష... మాకు రక్ష ఎవరు?

ఇదీచూడండి. సేంద్రీయ బెల్లం... ఆరోగ్యం పదిలం..!

Intro:ap_vja_06_17_pranalu_kapadutunna_matyakarulu_pkg_avb_ap10044

kit 736

కోసురు కృష్ణ మూర్తి, అవనిగడ్డ నియోజకవర్గం
సెల్.9299999511

యాంకర్ వాయిస్...
విహార యాత్రకు వచ్చే యాత్రికుల ప్రాణాలు కాపాడుతున్నారు, ప్రాణాలు పోవడం ఏమిటి ప్రాణాలు కాపాడటం ఏమిటి ఎక్కడ ఆ వివరాలేంటో చూద్దాం..

వాయిస్ ఓవర్....

కృష్ణాజిల్లా, కోడూరు మండలం, పాలకాయతిప్ప బీచ్ కృష్ణావన్యప్రాణి అభయరణ్యంలో పరిధిలో ఉన్నది.
అటవీశాఖ వన్యప్రాణి విభాగం వారు మడచెట్లు పెంచడం వలన మడచెట్లు అడవిలా చూడటానికి చాలా సంతోషం ఆహ్లాదంగా ఉంటుంది. ఎన్ని అరుదైన వన్య ప్రాణులను ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ ఉన్న ప్రకృతి అందాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఇటీవల సినిమా షూటింగ్ లు కూడా తీస్తున్నారు.

పాలకాయతిప్ప బీచ్ కు 3 కిలోమీటర్ల దూరంలో కృష్ణానది బంగాళాఖాతంలో కలిసే ప్రదేశం నది సముద్రం కలిసే ప్రాంతం పరమ పవిత్రమైన ప్రాంతంగా భావిస్తారు, కాకి ఇక్కడ స్నానం ఆచరించి హంసగా మారిందని పురాణ గాధలు ఉన్నాయి.
ఇక్కడ స్నానం చేస్తే సర్వ పాపాలు పోతాయని భక్తుల నమ్మకం

ఆదివారం మరియు సెలవు రోజుల్లో ఒక్కో రోజుకు సుమారు 2 వేల మంది పర్యాటకులు వస్తారు. వారికి ఎక్కడ స్నానం చేయాలో తెలియక సాగర సంగమం దగ్గర చూచిక బోర్డులు లేక నదిలోకి దిగి మృత్యువాత పడుతున్నారు.

సముద్రం అటు పోటు వలన సముద్రం నీరు చాలా వేగంగా ప్రవహిస్తుంది. నీటిలో 5 అడుగుల దూరంలో 50 అడుగుల లోతు వరకు ఉంటుంది. ఇక్కడ నదిలో దిగితే బ్రతకడం చాలా కష్టం గత పది సంవత్సరాల్లో ఇప్పటికి సుమారు 15 మంది కి పైగా నీటిలో మునిగి కాపడేవారు లేక ప్రాణాలు కోల్పోయారు.

ఆదివారాల్లో క్లౌడ్ ఎక్కువగా ఉన్న రోజుల్లో ఇద్దరు పోలీసులు మరియు ఫారెస్ట్, మెరైన్, వారితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

సముద్రం అలలకు లోతుకు వెళ్లి సముద్రంలో మునిగిపోతున్నారు, మునిగిపోతున్న వారిని సముద్రంలో చేపలు వేటాడే మత్యకారులు ప్రాణాలకు తెగించి వారిని కాపాడుతున్నారు. వారిని కాపాడే సమయంలో మత్యకారులు తమ ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుందని భయపడుతున్నారు.

ఫైర్ డిపార్ట్మెంట్ మరియు మెరైన్ డిపార్ట్మెంట్ ద్వారా తమకు కూడా లైఫ్ జాకెట్స్ మరియు లైఫ్ బాయ్ రింగ్స్ ఇస్తే ఇంకా ఎక్కువ మందిని కాపాడతామని మత్యకారులు చెబుతున్నారు. కొక్కిలిగడ్డ సముద్రాలు అనే అతను సముద్రంలో మ్యూనిగిపోతున్న వారిని పదిమంది వరకు ప్రాణాలు కాపాడారు
సంబంధిత శాఖల బీచ్ దగ్గర గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయాలని పర్యాటకులు కోరుతున్నారు.

వాయిస్ బైట్స్

పాలకాయతిప్ప మత్యకారులు
పర్యాటకులు.

Body:విహార యాత్రకు వచ్చే యాత్రికుల ప్రాణాలుమత్యకారులు కాపాడుతున్నారు, ప్రాణాలు పోవడం ఏమిటి ప్రాణాలు కాపాడటం ఏమిటి ఎక్కడ ఆ వివరాలేంటో చూద్దాం..

Conclusion:విహార యాత్రకు వచ్చే యాత్రికుల ప్రాణాలుమత్యకారులు కాపాడుతున్నారు, ప్రాణాలు పోవడం ఏమిటి ప్రాణాలు కాపాడటం ఏమిటి ఎక్కడ ఆ వివరాలేంటో చూద్దాం..

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.