విజయవాడ బెంజిసర్కిల్ సమీపంలోని రిలయన్స్ దుకాణాల సముదాయంలో అగ్ని ప్రమాదం జరిగింది. బిల్డింగ్ మొదటి అంతస్తులోని చెప్పుల దుకాణంలో మంటలు వ్యాపించాయి. సుమారు 60శాతానికిపైగా పాదరక్షలు మంటల్లో కాలిపోయాయి. ఈ సముదాయంలో వస్త్ర దుకాణం.... కార్పొరేట్ కార్యాలయంతోపాటు... ఇతర కార్యాలయాలు ఉన్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మంటలను ఆర్పే క్రమంలో సిబ్బంది ఒకరికి గాయాలయ్యాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమై ఉంటుందని అగ్నిమాపక అధికారులు ప్రాధమికంగా అంచనా వేశారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఘటనా స్థాలాన్ని పరిశీలించారు.
ఇదీ చదవండి: తేనెటీగల దాడిలో వ్యక్తి మృతి