స్థానిక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడనే అభియోగంతో కృష్ణాజిల్లా మోపిదేవి మండలం పెదప్రోలు గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న డి.రాజశేఖర్‌ను విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఆదేశాలు జారీ చేశారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన సదరు ఫీల్డ్ అసిస్టింట్ దాదాపు 100 మంది ఉపాధి హామీ మేటీలతో కలిసి ఎంపీడీఓకు వినతి పత్రం అందజేశారు. కేవలం రాజకీయ కారణాలతో తనను తొలగించారని కార్యాలయం ముందు రాజశేఖర్ బైఠాయించారు. దీనిపై అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం అందిచారు. అనంతరం ఎంపీడీఓతో మాట్లాడిన రాజశేఖర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు ఆధారాలు చూపిస్తే తానే విధుల నుంచి వైదొలుగుతానని చెప్పారు. రాజీనామా చేస్తానని చెప్పడంతో అధికారులు మరొక్కసారి విచారణ జరిపి ఎన్నికల్లో పాల్గొంటే సస్పెండ్ చేస్తామని లేకపోతే తన విధులు నిర్వహించుకోవచ్చునని ఉపాధిహామీ పథకం ఏపీడీ శ్రీలత తెలిపారు.
ఇదీ చదవండి: