కృష్ణా జిల్లా నందిగామలో అఖిలపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. దిల్లీలో నాలుగు రోజుల నుంచి నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ చేస్తున్న ఆందోళనకు మద్దతుగా... నిరసన ప్రదర్శన చేపట్టారు. స్థానిక గాంధీ సెంటర్ నుంచి చేపట్టిన ఈ ప్రదర్శనలో.. కాంగ్రెస్, వామపక్ష నాయకులు, రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు. నూతన వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చి రైతులు మోసం చేసిందని రైతు సంఘం నాయకులు విమర్శించారు. దిల్లీలో చేస్తున్న రైతులు ఆందోళనకు పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతున్నామన్నారు.
భాజపా ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వేల్పుల పరమేశ్వర్ విమర్శించారు. నూతన వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు గిట్టుబాటు ధర లేకుండా పోయిందని ఆరోపించారు. పత్తి కొనుగోలు చేయకపోవడం వల్ల పత్తిరైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు.
ఇదీ చదవండి: