ETV Bharat / state

E-CROP : 'రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి...అనర్హులకు లబ్ధి కలిగిస్తున్నారు' - e-crop-i

E-CROP : వ్యవసాయమే ఆధారంగా జీవిస్తున్న కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలంలోని రావిచెట్టు లంక గ్రామానికి చెందిన రైతులు... వ్యవసాయ అధికారుల మోసానికి గురై తీవ్ర నష్టాలు చూడాల్సి వస్తుంది. ప్రకృతి సహకరించకపోయినా ఒడుదొడుకులను ఎదుర్కొని సేద్యం చేస్తున్నారు. వరదలు, వర్షాలు, తెగుళ్లు వంటి వాటితో ఏటా నష్టాలు మూటకట్టుకుంటున్నారు.

కౌలు రైతుల ఆందోళన
కౌలు రైతుల ఆందోళన
author img

By

Published : Dec 6, 2021, 10:35 PM IST

Updated : Dec 7, 2021, 6:26 AM IST

E-CROP : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన(2019-2020) క్రాప్ ఇన్సూరెన్స్... లబ్ధిదారులకు చేరకుండా వ్యవసాయ అధికారులు ఇతరులకు మళ్లిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి పంటలు లేని భూమి, ఇసుక దిబ్బలకూ బీమా లబ్ధి చేకూరేలా వ్యవహరిస్తున్నారని ఆవేదన చెందారు. ఈ-క్రాప్ నమోదు చేయాల్సిన వ్యవసాయ అధికారుల అలసత్వంతో రైతులు నష్టపోతున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా... ఉపయోగం లేకుండా పోయిందని అన్నదాతలు మండిపడ్డారు. అర్హులైన వారిని పక్కన పెట్టి, అనర్హుల పేర్లను జాబితాలో చేర్చారని వాపోయారు. ప్రభుత్వం నుంచి వచ్చిన పరిహారాన్ని అనర్హులు తీసుకున్నారని, అసలు రైతులకు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీచదవండి: CM Jagan On Paddy Crop: అక్కడ వరికి బదులు.. ప్రత్యామ్నాయ పంటలు వేయాలి: సీఎం జగన్

Last Updated : Dec 7, 2021, 6:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.