కొనతాలపల్లి గ్రామం రైతు భరోసా కేంద్రం వద్ద అన్నదాతలు ఆందోళనకు దిగారు. ఇటీవల వరదల కారణంగా ఏర్పడిన పంట నష్టంకు ఇస్తున్న పరిహరంలో భారీ అవకతవకలకు జరుగుతున్నాయని వారు ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలతో రైతు భరోసా కేంద్రం వద్ద నిరసన తెలిపారు. అధికారులు లేకపోవటంతో రైతు భరోసా కేంద్రం బయట బైటాయించి తమకు న్యాయం చేయండి అంటూ నినాదాలు చేశారు. మండల వ్యవసాయాధికారి గింజుపల్లి రమేశ్ ను నష్ట పరిహారం విషయంలో జరిగిన అక్రమాలపై రైతులు నిలదీశారు.
ఇదీ చదవండీ.. పోలీసుల తీరుకు నిరసనగా.. విమానాశ్రయంలో చంద్రబాబు బైఠాయింపు