అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో రెవెన్యూ అధికారులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ... మచిలీపట్నం మండలం పొలట్టితిప్ప పరిసర ప్రాంత రైతులు... తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులు నిస్పక్షపాతంగా వ్యవహరించకుంటే మూల్యం చెల్లించక తప్పదని మాజీమంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు హెచ్చరించారు.
పంచాయతీ ఎన్నికల్లో తెదేపా మద్దతుదారులను గెలిపించారన్న కక్షతో గ్రామంలో చెరువుల మరమ్మతులను అడ్డుకోవడం దారుణమని తెదేపా నేతలు అన్నారు. అధికార పార్టీ వారికి చెందిన వారు చెరువులు తవ్వుతున్న పట్టించుకోని రెవెన్యూ అధికారులు... చిన్న రైతులను అడ్డుకోవడం సరికాదన్నారు. రెండ్రోజుల్లో వారికి న్యాయం చేయకుంటే తహసీల్దార్ కార్యాలయన్ని ముట్టడిస్తామని తెదేపా నేతలు హెచ్చరించారు.
ఇదీ చదవండి