ETV Bharat / state

'రైతు ఉత్పత్తిదారుల సంఘాలను బలోపేతం చేసేందుకు చర్యలు' - news updates in vijayawada

రైతు ఉత్పత్తిదారుల సంఘాలను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఉద్యానశాఖ కమిషనర్ చిరంజీవి చౌదరి చెప్పారు. దళారీల మోసాలు లేకుండా చేయటంతో పాటు, వినియోగదారులకు నాణ్యమైన ఆహార ఉత్పత్తులు అందించేందుకు కృషి చేస్తోందని తెలిపారు.

farmers-producer-company-has-launched-its-first-outlet-in-kanur-krishna-district
కానూరులో బీఫ్రెష్ మార్ట్ ప్రారంభం
author img

By

Published : Nov 21, 2020, 1:34 PM IST

ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ... తమ మొదటి ఔట్‌లెట్‌ను కృష్ణా జిల్లా కానూరులో ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ఉద్యానశాఖ కమిషనర్‌ చిరంజీవిచౌదరి, నూజీవీడు ఉద్యానశాఖ ఏడీ శ్రీనివాసులు, ఇతర రైతు ఉత్పత్తిదారుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. గతంలో నాబార్డు ఏర్పాటు చేసిన రైతు ఉత్పత్తిదారుల సంఘాలతోపాటు, ఉద్యానశాఖ ప్రత్యకంగా ఏర్పాటు చేస్తోన్న సంఘాలు, శీతల గోదాముల ఏర్పాటు, నర్సరీల పెంపకానికి షేడ్‌నెట్లు, కూలింగ్‌, రైపనింగ్‌ ఛాంబర్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు అందిస్తున్నాయని ఉద్యానశాఖ కమిషనర్‌ చిరంజీవిచౌదరి పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని రైతులు వినియోగించుకోవాలని కోరారు. కానూరుతోపాటు విజయవాడ నగర శివారులోని ప్రధాన కూడళ్లలో తమ ఔట్‌లెట్‌లను విస్తరింపజేస్తామని బిఫ్రెష్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు.

ఇదీచదవండి.

'ఇప్పుడు ఫిషింగ్ 4 హార్బర్లు ప్రారంభించా.. మరో 4 ఏర్పాటు చేయిస్తా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.