విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని దివి తాలూకా రైతు ఐక్యకార్యాచరణ కమిటీ కోరింది. కృష్ణా జిల్లా కోడూరులో సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా.. కమిటీ పలు తీర్మానాలు చేసింది. 'విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు' అనే నినాదంతో ముందుకెళ్దాం. తక్షణమే ప్రభుత్వం 22/ఎ నిషేధిత జాబితా నుంచి రైతుల సాగు చేస్తున్నభూములను తొలగించాలి. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి అని తీర్మానాలు చేసింది. దాన్యం కొనుగోలు కేంద్రాల్లో దాన్యం పోసి 20 రోజులైనా డబ్బులు చెల్లించడం లేదని, తుపాను ప్రభావంతో నష్టపోయిన రైతులకు ఇంకా నష్ట పరిహారం అందించలేదన్నారు. తక్షణమే అన్నదాతను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
తక్షణమే ప్రభుత్వం 22/ఏ నిషేధిత జాబితా నుంచి రైతులు సాగుచేస్తున్న భూములను తొలగించాలని కమిటీ కన్వీనర్, ప్రముఖ న్యాయవాది పర్చూరి రాఘవేంద్రరావు డిమాండ్ చేశారు. ప్రతిపక్షంలో ఉండగా రైతుల కోసం ధర్నాలు చేసిన వైకాపా నాయకులు, రైతు ప్రభుత్వం అని చెప్పుకునే జగన్ ప్రభుత్వం రైతులకు ఏం చేసిందని ప్రశ్నించారు. రైతు ఐక్య కార్యాచరణ సమితి రాష్ట్ర కార్యాలయాన్ని త్వరలో చల్లపల్లి గ్రామంలో ప్రారంభించనున్నట్లు రైతు నాయకులు వంగల సుబ్బారావు తెలిపారు.
ఇదీ చూడండి: ప్రణాళిక శాఖ అధికారులతో సీఎం జగన్ సమీక్ష