రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుబాబుల్, జామాయిల్ రైతు సమస్యలపై రైతులంతా సంఘటితంగా పోరాడాలని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. కృష్ణా జిల్లా నందిగామ మార్కెట్ యార్డు(Nandigama Market Yard)లో రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు నిర్వహించిన జిల్లాస్థాయి రైతు సమావేశం(Farmers Meeting)లో ఆయన పాల్గొన్నారు. ప్రస్తుతం టన్ను సుబాబులు రూ. 2 వేలకే కొనుగోలు చేయడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. ప్రతిపక్ష నాయకుడి హోదాలో సుబాబులు టన్నుకు రూ.5 వేలు ఇస్తామన్న ముఖ్యమంత్రి జగన్.. అధికారం చేపట్టి రెండేళ్లు గడిచినా దానిపై ఊసే లేదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటానికి రైతులంతా ఏకం కావాలని కోరారు. సుబాబుల్, జామాయిల్ రైతు సమస్యలపై ఢిల్లీ స్థాయిలో జరిగే ఉద్యమంలోనూ ప్రస్తావిస్తామన్నారు.
సుబాబుల్, జామాయిల్ రైతుల సమస్యలపై రాష్ట్రస్థాయిలో అన్ని జిల్లాల నుంచి రైతులు పోరాటం ప్రారంభించాలని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశవరావు కోరారు. సీఎం హామీలు ఇప్పటికీ అమలు కాలేదని.. అగ్రిమెంట్ ప్రకారం కనీసం రూ. 4,200 మద్దతు ధర ఇప్పించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే సౌమ్య, యార్డు ఛైర్మన్ కోట వీరబాబు, ఇతర నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి..
Insider trading: ఇన్‌సైడర్ ట్రేడింగ్.. హైకోర్టు ఉత్తర్వుల్లో తప్పేముంది: సుప్రీం