కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం కొత్తమాజేరులో పాము కాటుకు గురై.. తుమ్మా వెంకట నరసింహారావు అనే రైతు మరణించాడు. నిన్న పొలం పనులు చేస్తుండగా పాము కాటు వేసిన విషయం గమనించలేదు. సేద్యం పనులు పూర్తి చేసి ఇంటికి వచ్చి పడుకోగా.. రాత్రి 8 గంటల సమయంలో నురగలు కక్కుతూ పడిపోయాడు. దగ్గరలోని ఆసుపత్రికి తీసుకువెళ్లగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: