ETV Bharat / state

సైబరాబాద్ ఎస్ఐని అంటూ రాష్ట్రం దాటే యత్నం.. పట్టుకున్న పోలీసులు - latest crime news in gollapudi

నకిలీ పోలీసు వేషం కట్టి.. రాష్ట్రం దాటడానికి ప్రయత్నించిన వ్యక్తిని విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. గొల్లపూడి వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ వ్యక్తి సైబరాబాద్ ఎస్ఐని అంటూ... గుర్తింపు కార్డు చూపించాడు. అది నకిలీ కార్డుగా గుర్తించిన పోలీసులు... నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

నకిలీ పోలీస్​ అవతారమెత్తిన వ్యక్తిని అరెస్ట్​ చేసిన పోలీసులు

author img

By

Published : Jun 25, 2020, 3:43 PM IST

విజయవాడలో ఓ నకిలీ పోలీసును భవానీపురం పోలీసులు అరెస్టు చేశారు. కొవిడ్​-19 కారణంగా ఏర్పాటు చేసిన అంతరాష్ట్ర చెక్ పోస్టులను దాటేందుకు ఓ వ్యక్తి సైబరాబాద్‌ ఎస్ఐగా వేషం కట్టి పోలీసులకు దొరికిపోయాడు. విజయవాడ శివారు గొల్లపూడి సమీపంలో భవానిపురం పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా నకిలీ గుర్తింపు కార్డుతో వెళ్తున్న అతడు.. అడ్డంగా పట్టుబడ్డాడు.

నిందితుడు తూర్పుగోదావరి జిల్లా మమ్మిడివరానికి చెందిన గుత్తాల ప్రశాంత్​గా పోలీసులు విచారణలో గుర్తించారు. ప్రశాంత్​ హైదరాబాదులో ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహించేవాడని తెలిపారు. అతడి నుంచి స్విప్ట్ డిజైర్ కారు, నకిలీ గుర్తింపు కార్డులు, పోలీస్ యూనిఫాం స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన భవానీపురం పోలీసులు విచారణ చేపట్టారు.

ఇదీ చూడండి:

తస్మాత్ జాగ్రత్త: ఆన్​లైన్ పేమెంట్​ చేస్తే ఇక అంతే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.