గుంటూరు కేంద్రంగా జరుగుతున్న నకీలి పెస్టిసైడ్స్ దందాను విజయవాడ టాస్క్‌ఫోర్స్ పోలీసులు వెలికితీశారు. సిన్ జెంటా అగ్రో కెమికల్ ప్రైవేట్ కంపెనీ పేరుతో నకిలీ రసాయన ఎరువులు తయారు చేస్తున్నారని సమాచారం అందుకున్న పోలీసులు నిఘా పెట్టి వారిని అరెస్ట్ చేశారు. లక్ష్మీనారాయణ, రాము అనే ఇద్దరు సోదరులు సిన్ జెన్ అనే బ్రాండ్ కంపెనీ పేరుతో నకిలీ ఎరువులను తయారు చేసి విక్రయిస్తున్నారు. దీని కోసం గుంటూరు జిల్లా పెదకాకానిలో ప్రత్యేక తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
లక్ష్మీ నారాయణ సీన్జెన్ కంపెనీలో గోడౌన్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. అతను కంపెనీలో గోడౌన్ మేనేజర్ కావటంతో అతను తయారు చేసిన నకిలీ ఎరువులను కూడా ఇదే గోడౌన్లో దాచి..పెస్టిసైడ్ దుకాణాలకు అమ్మేవాడు. కంపెనీ యాజమాన్యానికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయగా... విజయవాడ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ముందుగా ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని 120 సీసాల నకిలీ రసాయన ఎరువులను స్వాధీనం చేసుకున్నారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు మరో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
ఇదీ చదవండి: