కృష్ణా జిల్లా నందివాడ మండలం తమిరిశలోని ఓ ప్రభుత్వ మద్యం దుకాణంలో నకిలీ లిక్కర్ విక్రయాలు జొరుగా కొనసాగుతున్న తీరు బట్టబయలైంది. ఎక్సైజ్ అధికారులు చేపట్టిన సాధారణ తనిఖీల్లో భాగంగా నకిలీ లిక్కర్ బాటిళ్లను అధికారులు గుర్తించారు. షాపులో మూడు వేలకుపైగా నకిలీ మద్యం బాటిళ్లకు సంబంధించిన స్టిక్కర్లు ఉన్నట్లు సమాచారం.
ఆ తర్వాతే పూర్తి వివరాలు..
ఎస్ఎన్ఎస్ బ్రాండ్ పేరుతో ఉన్న నకిలీ బాటిళ్లు ఈ సోదాల్లో పట్టుబడినట్లు ఎక్సైజ్ సీఐ నాగవాణి తెలిపారు. పూర్తి స్థాయిలో విచారణ చేసి వివరాలు వెల్లడిస్తామని ఆమె అన్నారు. ఈ నేపథ్యంలో సదరు మద్యం దుకాణాన్ని అధికారులు సీజ్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: