కృష్ణాజిల్లాలో తిరువూరు కేంద్రంగా వెలుగు చూసిన ఆధార్ అక్రమాల వ్యవహారంలో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులు వెల్లడించిన వివరాల ప్రకారం...వృద్ధాప్య పింఛన్లు, వైఎస్సార్ చేయూత వంటి సంక్షేమ పథకాలకు దొడ్డిదారిలో లబ్ధి చేకూర్చడం కోసం ఆధార్ కార్డులలో వయస్సు, ఇతరత్రా వివరాలను మార్పులు, చేర్పులు చేయటం ద్వారా అక్రమాలు జరిగాయన్నారు.
ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన తిరువూరు పట్టణానికి చెందిన మీ సేవ కేంద్రం నిర్వాహకుడు గజ్జల కోదండ సాయికృష్ణ, ఫోటోగ్రాఫర్లు రాచప్రోలు కిషోర్, పరాంకుశం అయ్యప్ప, తెలంగాణలోని ఖమ్మం జిల్లా బయన్నగూడెం గ్రామానికి చెందిన షేక్ షాహిదాలను అరెస్టు చేశామన్నారు. వీరి వద్ద నుంచి నకిలీ పాన్ కార్డులు, ఆధార్ కార్డులు, ల్యాప్‌టాప్, కంప్యూటర్లు, హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ వ్యవహారంలో మరికొందరి పాత్ర ఉన్నట్లు దర్యాప్తులో గుర్తించామని...త్వరలో వీరిని కూడా అరెస్టు చేస్తామన్నారు.
ఇదీచదవండి
గరికపాడు చెక్‌పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలను పరిశీలించిన ఏఎస్పీ