ETV Bharat / state

అన్నదాతలను కోలుకోలేని విధంగా దెబ్బతీసిన వరదలు

author img

By

Published : Oct 19, 2020, 5:11 AM IST

వర్షాలు, వరదలు.. రైతులను నిండా ముంచేశాయి. కౌలు రైతులు కోలుకోలేని విధంగా దెబ్బతిన్నారు. మళ్లీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించటంతో.. మిగిలిన పంటమీదా అన్నదాతలు ఆశలు వదిలేశారు. పూర్తిస్థాయిలో కాకపోయినా... ఉపశమనం కల్పించేలా పరిహారమిస్తామని, త్వరలోనే రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం చేసిన ప్రకటనపైనే ఆశలన్నీ పెట్టుకున్నారు.

Extreme levels of floods in AP
అన్నదాతలను కోలుకోలేని విధంగా దెబ్బతీసిన వరదలు
అన్నదాతలను కోలుకోలేని విధంగా దెబ్బతీసిన వరదలు

కృష్ణా జిల్లాలో ముంపు ప్రభావిత ప్రాంతాలు క్రమంగా ముంపు నుంచి బయటపడుతుండగా... లంక గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ప్రకాశం బ్యారేజీ నుంచి 6 లక్షల 15 వేల క్యూసెక్కులు విడుదల చేస్తుండటంతో... దిగువనున్న నివాస ప్రాంతాలు, పొలాలు నీటిలోనే నానుతున్నాయి. వరద తగ్గిన ప్రాంతాల్లోని ఇళ్లకు ప్రజలు వెళ్తుండగా... లంక గ్రామాలు, మునక ప్రాంతవాసులు పునరావాసాల్లోనే తల దాచుకుంటున్నారు. పారిశుద్ధ్య పనులు పూర్తయ్యాకే ఇళ్లకు వెళ్లాలని అధికారులు సూచించారు. జగ్గయ్యపేట వద్ద నీటిమట్టం దాదాపు 12 అడుగులు తగ్గగా.. అవనిగడ్డ, మోపిదేవి మండలాల్లోని పలు గ్రామాలు ఇంకా మునకలోనే ఉన్నాయి. పులిగడ్డ అక్విడిక్ట్‌ వద్ద రెండు అడుగులు తగ్గి 18 అడుగుల మేర వరద ప్రవాహం కొనసాగుతోంది.

కృష్ణా జిల్లాలో దాదాపు 23వేల హెక్టార్లలో పంటలు నీట మునిగినట్టు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. 33 శాతం దాటిన నష్టాలే పరిగణలోకి తీసుకుంటున్నందున.. గణన పూర్తయ్యేసరికి నష్టం తగ్గే వీలుంది. వరద పరిహారం వెంటనే చెల్లించాలని రైతులు కోరుతున్నారు. పంటలన్నీ నీటమునిగి పూర్తిగా కుళ్లిపోయిందని... తమ జీవనం కొనసాగాలంటే ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. పరిహారం అంచనా వేయటానికి వచ్చిన అధికారులు కౌలు కార్డులు అడుగుతున్నారని రైతులు వాపోతున్నారు.

గుంటూరు జిల్లాలో వరద సహాయక చర్యలపై కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ అధికారులతో సమావేశం నిర్వహించారు. రైతులు ఆందోళన చెందవద్దని కొల్లూరులో ఆయన చెప్పారు. ముంపు గ్రామాల్లో తాగునీరు, పారిశుద్ధ్యం, దోమల నివారణ పనులు వేగంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తాడికొండలో ముంపునకు గురైన పంట పొలాలను ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పరిశీలించారు. కృష్ణా పశ్చిమ డెల్టా లంక గ్రామాల్లో పర్యటించిన జనసేన నేతలు... రైతులకు భరోసా ఇవ్వటంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. పెట్టుబడి మొత్తాన్ని చెల్లించాలని డిమాండ్‌ చేశారు. రైతుల కష్టాలను పవన్‌కల్యాణ్‌ దృష్టికి తీసుకెళ్తామని ఆ పార్టీ ముఖ్యనేత నాదెండ్ల మనోహర్‌ తెలిపారు.

తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం రైతులు... తమ పొలాల్లో నీరు నిలిచిపోవటంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి చొరవతో... ఉచ్చిలి సమీపంలోని ఆర్​అండ్​బీ రోడ్డుకు గండికొట్టి పొలాల్లోని నీటిని కాలువకు తరలించారు. స్లూయిజ్‌ కాలువ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీపీఎం నేతలు... గుండేరు ముంపు నివారణకు శాశ్వత చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

నష్టపోయిన ప్రతి రైతునూ ప్రభుత్వం ఆదుకుంటుందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు భరోసా ఇచ్చారు. పెదపూడి మండలంలోని రామేశ్వరంలో పంటనష్టాన్ని పరిశీలించిన ఆయన... ముంపు ప్రాంత వాసులకు భోజనం, మంచినీళ్లు అందిస్తున్నామన్నారు.

ఇదీ చదవండీ... బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్ల నియామకం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.