ప్రజా భద్రతా చట్టం 1992 కింద 2019 ఆగస్టు 17 నుంచి ఏడాది పాటు మావోయిస్టు పార్టీపై నిషేధాన్ని పొడిగిస్తూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మావోయిస్టు పార్టీతో పాటు దాని అనుబంధ సంస్థలైన రైతు కూలీ సంఘం, ర్యాడికల్ స్టూడెంట్స్ యూనియన్, విప్లవకార్మిక సమాఖ్య( వికాస), సింగరేణి కార్మిక సమాఖ్య (సికాస), ఆల్ ఇండియా రివల్యూషనరీ స్టూడెంట్స్ ఫెడరేషన్, ర్యాడికల్ యూత్ లీగ్, రివల్యూషనరీ డెమోక్రాటిక్ ఫ్రంట్ తదితర సంస్థలపై నిషేధం వర్తింప చేస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. 1991 నుంచి ఈ సంస్థలపై ప్రతీ ఏటా నిషేధాన్ని పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తోంది.
ఇదీ చదవండి : డుడుమా జలశాయంలో 3గేట్లు ఎత్తివేత