అమరావతి రైతులకు వారసత్వంగా వస్తున్న భూములను రాజధాని నిర్మాణం కోసం త్యాగం చేశారని... మాజీఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పేర్కొన్నారు. కృష్ణా జిల్లా నందిగామ తెదేపా పార్టీ కార్యాలయంలో సౌమ్య మీడియాతో మాట్లాడారు. కొద్ది రోజులుగా రాజధాని ప్రాంత రైతులు మానసిక వేదనతో రోడ్లపై ధర్నాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మందడంలో... నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలపై దాడులను తాము ఖండిస్తున్నామని సౌమ్య చెప్పారు. టిక్‌టాక్ వీడియోలు చేసుకుంటూ... కాలయాపన చేసే మంత్రి పుష్పశ్రీవాణికి నారా భువనేశ్వరిని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు.
ఇదీ చదవండి: రాజధాని రైతులకు విజయవాడ కాలనీవాసులు మద్దతు..