కృష్ణా జిల్లా నందిగామ మార్కెట్ యార్డ్‌లో కొన్ని రోజుల నుంచి పత్తి కొనుగోళ్లు జరగటం లేదని మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆందోళన మేరకు ఆమె మార్కెట్ యార్డ్‌ను పరిశీలించారు. పంట నాణ్యత లేదని ఆరోపిస్తూ... కొనుగోలు చేయకుండా ఇబ్బంది పెడుతున్నారని రైతుల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై సీసీఐ బయ్యర్ వ్యవహార శైలి సక్రమంగా లేదని సౌమ్య ఆగ్రహించారు. వెంటనే పత్తి కొనుగోలు చేయకపోతే తీవ్రస్థాయిలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
అవసరమైతే బయ్యర్‌ను మార్చాలని డిమాండ్ చేశారు. రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉంటే కొనుగోలు చేయకుండా మరింత ఇబ్బంది పెట్టడం ఏంటని ప్రశ్నించారు. రైతులను ఇబ్బంది పెట్టకుండా కొనుగోలు చేయాలని యార్డు సూపర్వైసర్ స్వప్నను కోరారు. మొక్కజొన్న రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారని త్వరగా.. పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: