మాజీ మంత్రి కొల్లు రవీంద్ర బెయిల్ పిటిషన్ పై తీర్పును ఈనెల 30వ తేదీకు రిజర్వ్ చేసింది న్యాయస్థానం. మచిలీపట్నంలో వైకాపా నాయకుడు మోకా హత్య కేసులో.. నిందితునిగా రాజమండ్రి జైలులో ఉన్న రవీంద్ర బెయిల్ పిటిషన్ పై మంగళవారం విచారణ జరిగింది. కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తి.. వై.లక్ష్మణ్ రావు ఇరుపక్షాల వాదనలు విన్నారు. ప్రభుత్వ న్యాయవాదిగా కళ్యాణి, కొల్లు తరపున న్యాయవాది సిద్ధార్ధ లోద్ర వాదనలు వినిపించారు. మచిలీపట్నంలో వైకాపా నాయకుడు మోకా హత్య కేసులో.. నిందితునిగా రాజమండ్రి జైలులో ఉన్న రవీంద్ర బెయిల్ పిటిషన్ పై నేడు ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఈ నెల 30వ తేదీకు తీర్పును రిజర్వ్ చేసింది.
ఇదీ చదవండి: బెడ్లు లేవనే మాట ఎట్టి పరిస్థితుల్లోనూ వినపడొద్దు: సీఎం జగన్