అమరావతి ఐకాస పిలుపుమేరకు పోరాటాల సంక్రాంతి సంబరాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. రాజధాని అమరావతి తరలింపు నిరసిస్తూ కృష్ణా జిల్లా తిరువూరులో రాజకీయ ఐకాస ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని ఆయన సందర్శించి మద్దతు తెలిపారు. భోగి నాడు జీఎన్ రావు, ఇతర కమిటీల నివేదికలను మంటల్లో వేసి తగలబెట్టాలని పిలుపునిచ్చారు. అమరావతి ఐకాస పిలుపు ఇస్తే పది వేల మంది మహిళలు రోడ్డెక్కారని... వారిని కట్టడి చేయటానికి ప్రభుత్వం మూడు వేల మంది పోలీసులు ప్రయోగించిందని దేవినేని అన్నారు. రేపు ఐదు కోట్ల మంది ప్రజలు రోడ్డెక్కితే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసే వరకు ప్రజా ఉద్యమం కొనసాగిస్తామని తెదేపా నేత స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: