న్యాయ వ్యవస్థపై అందరికీ అవగాహన అవసరమని కృష్ణా జిల్లా జూనియర్ సివిల్ కోర్టు జడ్జీ షేక్ షిరీన్ అన్నారు. ఇప్పటికీ గ్రామాల్లో నివసించే ప్రజలకు చట్టాలపై, న్యాయ సంస్థ గురించి పూర్తి స్థాయిలో తెలియకపోవడం బాధాకరమన్నారు. కరోనా నేపథ్యంలోనూ న్యాయం అందించాలనే ఉద్దేశంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సుమారు 200 కేసులు పరిష్కరించామని తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా రాజీ పద్ధతిలో న్యాయం అందిందని వివరించారు. న్యాయ సేవాధికార సంస్థ లక్ష్యాలు, ప్రయోజనాల గురించి విస్తృత ప్రచారం కల్పించాలని ఆమె కోరారు.
ఇదీ చదవండి: