వైకాపా ఏడాది పాలనలో ప్రతి స్కీము స్కాం కోసమే పెట్టారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ఆరోపించారు. ఆత్మస్థుతి - పరనింద తప్ప ఏడాది పాలనలో ఏమున్నది గర్వకారణమని దుయ్యబట్టారు. ఆత్మవిమర్శ ఇసుమంతైనా ఉందా అని ధ్వజమెత్తారు.
మేనిఫెస్టో హామీలు 90 శాతం అమలు పరచడమంటే 200 శాతం పైగా ధరలు పెంచడమేనా అని మండిపడ్డారు. ఏడాదిలోనే ధరలు పెంచడం ద్వారా 50 వేల కోట్ల రూపాయల భారం ప్రజలపై మోపారన్న ఆయన.. 87 వేల కోట్ల రూపాయలు అప్పు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క మద్యంలోనే జే- ట్యాక్స్ 25వేల కోట్ల రూపాయలు దండుకుంటున్నారన్న కళా.. ఇసుక, భూములు, మద్యం మాఫియాగా వైకాపా నేతలు దోచుకుంటున్నారని మండిపడ్డారు. ఇచ్చేది గోరంత.... ప్రచారం కొండంతలా వైకాపా పాలన ఉందని విమర్శించారు.
ఇదీ చదవండి